ప్రభుత్వం చేపడుతున్న కుల గణన సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ సూచించారు. కొడంగల్ ఎంపీడీవో కార్యాలయం, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్యూమరేటర్లకు సర్వేపై నిర్వహించిన శిక్షణలో ఆయన పాల్గొని మాట్లాడారు. వచ్చే నెల 6 నుంచి ప్రారంభమయ్యే సర్వేలో తప్పులు లేకుండా వివరాలు సేకరించాలన్నారు. ప్రత్యేక అధికారి జ్ఞానేశ్వర్, ఎంపీడీవో ఉషశ్రీ, తహసీల్దార్ విజయ్ కుమార్ పాల్గొన్నారు.