కొడంగల్: ఓటు హక్కుపై విద్యార్థులకు అవగాహన

50பார்த்தது
కొడంగల్: ఓటు హక్కుపై విద్యార్థులకు అవగాహన
వికారాబాద్ జిల్లా కొడంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం తహశీల్దార్ బీ. విజయ్ కుమార్ విద్యార్థులకు ఓటు హక్కు ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ నెల 9, 10వ తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఓటరుగా నమోదు, మార్పులు, చేర్పులకు అవకాశం ఉందని, యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

தொடர்புடைய செய்தி