గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మెలో భాగంగా శనివారం 10వ రోజు బొంరాస్ పేట, దుద్యాల, దౌల్తాబాద్, కొడంగల్ మండలాలకు చెందిన గ్రామపంచాయతీ కార్మికులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడంతో గ్రామ సర్పంచ్ సయ్యద్ అంజాద్ కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు.