కొడంగల్ నియోజకవర్గం బొంరాస్ పేట మండలం ఏర్పుమళ్ళ గ్రామంలో శుక్రవారం స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో భాగంగా ఫ్రైడే- డ్రై డే కార్యక్రమం నిర్వహించారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని నీటిని వృధా చేయకుండా పెరటి తోట పెంచుకున్న కుటుంబాన్ని గుర్తించి సన్మానించడం జరిగింది. అనంతరం నీరు నిల్వ ఉండే తొట్టి, డ్రమ్ములో నీరు నిల్వ ఉండకుండా చూసుకునేలా చూడాలని అవగాహన కల్పించడం జరిగింది. .