మెగా హీరో వరుణ్ తేజ్– లావణ్య త్రిపాఠి ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా ఇవాళ ఓ స్పెషల్ పెళ్లి వీడియోను షేర్ చేసారు. పెళ్లి వేడుకల్లోని కొన్ని విజువల్స్‌ని కలిపి వీడియో రూపొందించారు. అందులో వరుణ్–లావణ్య పెళ్లి, కుటుంబ సభ్యులు డ్యాన్స్‌లు వేయడం, అందరూ ఆప్యాయంగా పలకరించుకోవడం, ఫోటోషూట్స్.. ఇలా అన్ని చూపించారు. దీంతో అభిమానులు వారికి వెడ్డింగ్ యానివర్సరీ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ వీడియో క్యూట్‌గా ఉందని కామెంట్లు చేశారు.