దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇద్దరు వధువులకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. రాజస్థాన్లోని దౌసాలోని మల్హర్నా స్కూల్ పోలింగ్ స్టేషన్ వద్ద జరుగుతున్న పోలింగ్లో భాగంగా ఇద్దరు వధువులు తమ ఓటు వేయడానికి పెళ్లి దుస్తుల్లోనే వచ్చారు. దీంతో స్థానికులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. ఓ పక్క పెళ్లి ఉన్నా.. తమ బాధ్యత నిర్వర్తించడానికి వచ్చినందుకు వీరిని అభినందిస్తున్నారు.