ఉత్తరప్రదేశ్లో మరో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం ‘మా బెల్హా దేవి ధామ్’ రైల్వే జంక్షన్ సమీపంలో షంటింగ్ ఆపరేషన్ సమయంలో రెండు ఖాళీ రైలు కోచ్లు పట్టాలు తప్పాయి. ఈ సంఘటన తెల్లవారుజామున 5.30 గంటలకు జరిగింది. అయితే, ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం వల్ల అటుగా వెళ్లే రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. సుమారు 11 గంటల సమయంలో రాకపోకలను పునరుద్ధరించారు.