కుమ్రంభీమ్ జిల్లా జైనూర్ అడవుల్లో పులి సంచారం కలకలం రేపింది. రాశిమెట్ట గూడెంలో పశువులపై ఆ పులి దాడిచేసింది. ఈ ఘటనలో రెండు ఆవులు ప్రాణాలు కోల్పోయాయి. దీంతో పరిసర ప్రాంత ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. దీంతో ప్రజలు చేను పనులకు, అడవుల్లోకి వెళ్లొద్దని అటవీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. బేస్ క్యాంప్లు ఏర్పాటుచేసి పులి కదలికలను పర్యవేక్షిస్తున్నారు.