తనపై, తన కుటుంబ సభ్యులపై ఇటీవల జరిగిన ఈడీ, ఐటీ దాడులపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తొలిసారి స్పందించారు. బీఆర్ఎస్, బీజేపీ మంచి దోస్త్ అని.. తన ఇంట్లో జరిగిన సోదాలకు సంబంధించిన డేటాను బీజేపీని అడిగి బీఆర్ఎస్ రిలీజ్ చేసుకోవాలన్నారు. ఖమ్మం జిల్లాలో పర్యటించిన మంత్రి పొంగులేటి ఓ మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ.. బీఆర్ఎస్, బీజేపీ మాటలు వింటుంటే నవ్వు వస్తుందన్నారు. బీఆర్ఎస్ గడిచిన పదేళ్లుగా ప్రజలతో ఉన్న సంబంధాలను కోల్పోయిందని ధ్వజమెత్తారు.