ప్రభుత్వాసుపత్రిలో మృతదేహం కన్ను మాయమైన ఘటన బీహార్ రాజధాని పాట్నాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఈనెల 15న ఫంతుష్ కుమార్ అనే యువకుడు కాల్పుల్లో గాయపడగా నలంద ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మరణించాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తీసుకెళ్తుండగా కన్ను మాయమైనట్లు గుర్తించారు. కన్నును ఎలుకలు పెకలించి ఉండొచ్చని వైద్యులు చెబుతుండగా, సిబ్బందే తొలగించారని మృతుడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.