గ్రేటర్ హైదరాబాద్ మినహా మిగతా 7 పాత జిల్లాల పరిధిలో ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభిస్తారు. ప్రభుత్వం ఏటా నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇళ్లను ఇవ్వాలని నిర్ణయించింది. గరిష్ఠంగా ఏడాదికి 4.50 లక్షల ఇళ్లను ఇవ్వనుంది. ఇందిరమ్మ ఇళ్లకు మొత్తం 80 లక్షల దాకా దరఖాస్తులు వచ్చాయి. మొదటి విడతలో మండలానికి ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసి మొత్తం 72,045 ఇళ్లను నిర్మించి ఇవ్వనున్నారు. ఇంటి నిర్మాణానికి 4 విడతల్లో లబ్ధిదారుకి రూ.5 లక్షలను అందిస్తారు.