సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్ పట్టణంలో మున్సిపల్ అధికారులు పలు దుకాణాలను కూల్చివేశారు. ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన పలు నిర్మాణాలను తొలగిస్తున్నారు. అయితే వాటిని తొలించవద్దంటూ వాహనాలకు అడ్డంగా కూర్చొని స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. ' సారూ.. మా పొట్టకొట్టొద్దు. ప్లీజ్ నా మంగలి షాప్ కూల్చకండి' అంటూ ఓ వ్యక్తి వెక్కివెక్కి ఏడ్చాడు. కూల్చివేస్తున్న వాహనానికి అడ్డంగా పడుకొని ప్రాధేయపడ్డాడు.