పస లేని, పనికిరాని పాగల్ పాలనలో తెలంగాణ ఆగమైతోందని కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. 'తెలంగాణ తిరగబడుతోంది-తెలంగాణ తల్లడిల్లుతోంది. అసమర్థ మూర్ఖ ముఖ్యమంత్రి ఏలుబడిలో రైతన్నలు రోడ్డెక్కారు. హైడ్రాపై జనం తిరుగుబాటు చేస్తున్నారు. గ్రూప్స్ పరీక్షల కోసం విద్యార్థిలోకం భగ్గుమంది. ఫార్మా కోసం భూములు లాక్కోవద్దని అన్నదాతలు కన్నెర్రజేశారు. కులగణన ప్రశ్నలపై అన్ని వర్గాల్లో అసంతృప్తి నెలకొంది' అని Xలో ట్వీట్ చేశారు.