తెలంగాణ బడ్జెట్ FY2025–26కు రూ.3.20 లక్షల కోట్లకు కాస్త అటు ఇటుగా ఉండొచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు. గతేడాది రూ.2.91 లక్షల కోట్ల బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టగా, ఈసారి అంతకంటే ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారి ఇంత పెద్ద మొత్తంలో ఉండొచ్చని అంటున్నారు. దీనికి అనుగుణంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, అప్పులకు వడ్డీల కింద అధిక నిధులు కేటాయించేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం.