తెలంగాణలో తెలుగుదేశం పార్టీ దూకుడు పెంచింది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు, ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు తెలంగాణలోని పార్లమెంట్ నియోజకవర్గాలకు కన్వీనర్లను నియమించారు. ఈ మేరకు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు బక్కని నర్సింహులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. మొత్తం తెలంగాణలోని 16 జిల్లాలకు కన్వీనర్లు నియమించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్‌కు నియమించాల్సి ఉంది.