తుంగతుర్తి మండలం వెంపటికి చెందిన కొండగడుపుల మహేశ్వరి ఆర్థిక సమస్యలతో మెడిసిన్ సీటు వచ్చినప్పటికి ఫీజు కట్టలేక చేరలేదు. మళ్ళీ ఎంసెట్ రాస్తే హైదరాబాదు ఆర్టికల్చర్ కాలేజిలో సీటు వచ్చింది అయినప్పటికి ఫీజు కోసం ఆర్థిక సమస్యలతో ఇబ్బందిపడుతుండగా ఈ విషయాన్ని ఎమ్మెల్యే మందుల సామెల్ దృష్టికి కాంగ్రెస్ నాయకురాలు ఝాన్సీ రాజిరెడ్డి తీసుకువెళ్లగా మహేశ్వరి చదువుకు అండగా నిలిచారు. సోమవారం ఆమె తల్లిదండ్రులను హైదరాబాద్ కు పిలిపించి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.