సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ శనివారం కలెక్టరేట్ లో మెడికో విద్యార్థిని శిగ గౌతమికి రూ. లక్ష చెక్కును అందజేశారు. శిగ గౌతమి గురించి లోకల్ యాప్ లో వచ్చిన విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేసి మానవత్వం చాటిన జిల్లా కలెక్టర్.. తుంగతుర్తి మండలం వెంపటి గ్రామానికి చెందిన శిగ గౌతమి నీట్ పరీక్ష రాయగా ఎంబీబీఎస్ సీటుకు ఎంపిక అయ్యింది. ఆ విద్యార్థిని నిరుపేద కావడంతో ఆమెకు ఆర్థిక సహాయం అందజేశారు.