విద్యార్థులకు ఫీజు రీయంబర్స్ మెంట్ విడుదల చేయాలని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం బెస్ట్ అవైలబుల్ స్కీం ద్వారా చదువుతున్న విద్యార్థులకు ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలని కేవీపీఎస్, ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘాల నాయకులు శ్రీకాంత్, వినోద్, సతీష్, మనోజ్, అనిల్ ఉన్నారు.