దీపావళి ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. శుక్రవారం దీపావళి పండుగను పురస్కరించుకొని చిలుకూరు మండలంలోని నారాయణపురం, జానకి నగర్ గ్రామాలలో అమ్మవారి ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అజ్ఞానాంధకారాలు తొలగించే విజ్ఞానపు వెలుగులు దీపావళి ప్రసాదించాలని కోరారు. ఈ కార్యక్రమం లో స్థానిక నాయకులు ఉన్నారు.