లక్కవరం లో అమ్మవారి దగ్గర అన్నదానం

482பார்த்தது
లక్కవరం లో అమ్మవారి దగ్గర అన్నదానం
అనంతగిరి మండలం లక్కవరం గ్రామం లో అత్యంత వైభవంగా జరుగుతున్నటువంటి దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు మహిళలు కోలాటాలు వేసి ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ విచ్చేసి అన్నదాన కార్యక్రమాన్ని ఆరంభించారు. అదేవిధంగా కోదాడ మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర సుధారాణి పుల్లారెడ్డి, సర్పంచ్ భూపతి, వైస్ సర్పంచ్ కబీర్ సాహెబ్, కమిటీ నిర్వాహకులు ఉప్పునూరి వెంకటరెడ్డి, గ్రామ పెద్దలు బుర్ర నర్సిరెడ్డీ, రాజమోహన్ రెడ్డి, వెంకట్రామిరెడ్డి, రామారావు తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி