హుజూర్నగర్: పేదల అభ్యున్నతికి కృషి
జమాతే ఇస్లాం హింద్ పేదల అభ్యున్నతికి కృషి చేస్తుందని ఆ సంస్థ అధ్యక్షులు మజీద్ భాయ్ అన్నారు. బుధవారం పట్టణానికి చెందిన లతీఫా బేగంకు కుట్టు మిషన్ అందజేసి మాట్లాడారు. తమ సంస్థ ద్వారా జీవనోపాధి పొందేందుకు ఆర్థిక సహకారం అందజేస్తున్నట్లు తెలిపారు. సంస్థ సహకారాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని కోరారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు మజీద్ భాయ్ ని పలువురు అభినందించారు.