హుజూర్ నగర్ మండలం బూరుగడ్డ రెవిన్యూ లో 36. 23 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇతర వ్యక్తుల పేరున ఐఎల్ఎంఆర్ఎస్ పోర్టల్ లోకి అక్రమంగా మార్పిడి చేసి రైతుబంధు సొమ్మును కాజేసి అరెస్టు అయిన తహశీల్దార్ వజ్రాల జయశ్రీ (A1)కి బెయిల్ మంజూరు చేస్తూ హుజుర్ నగర్ జూనియర్ సివిల్ కోర్టు మెజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేశారు. జయశ్రీ కు బెయిల్ మంజూరు కావడంతో సోమవారం సాయంత్రం ఆమె స్థానిక జైలు నుండి విడుదలయ్యారు.