వినియోగదారుల విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని హుజూర్నగర్ డిఈ వెంకట కృష్ణయ్య అన్నారు. ఆదివారం హుజూర్నగర్ విద్యుత్ డివిజినల్ ఇంజనీర్ కార్యాలయంలో నిర్వహించిన విద్యుత్ వినియోగదారుల సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు వినియోగదారులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చారు. ఈ కార్యక్రమంలో ఏడిఏ శక్రు నాయక్, ఏడి వెంకన్న, ఏఈలు, విద్యుత్ సిబ్బంది, వినియోగదారులు పాల్గొన్నారు.