ప్రముఖ స్టార్‌బక్స్ కంపెనీ కొత్త పాలసీని ప్రకటించింది. కస్టమర్లు తమ కేఫ్‌లలో వాష్‌రూమ్ వాడుకోవాలంటే తప్పనిసరిగా ఏదో ఒకటి కొనుగోలు చేయాలని పేర్కొంది. ఈ పాలసీ జనవరి ఆఖరు నుంచి అమల్లోకి రానుందని వెల్లడించింది. కస్టమర్లు తమ స్టోర్‌కు వచ్చిన తర్వాత సిబ్బంది వారిని ఏదైనా కావాలా? అని అడిగే హక్కు ఉందంది. కొంచెం సేపు ఉండాలనుకున్నావారికి అపరిమితంగా కోల్డ్ లేదా హాట్ కాఫీ సరఫరా చేయనున్నారు. నిబంధలను పాటించని వారిని బయటకు పంపే హక్కు కూడా ఉన్నట్లు మెయిల్‌లో వెల్లడించింది.