SSR-దిశా సాలియాన్ డెత్ కేసుల్లో మహారాష్ట్ర, మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే కొడుకు, ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే చిక్కుల్లో పడ్డారు. దిశది సూసైడ్ కాదని, హత్య చేశారని ఆమె తండ్రి సతీశ్ ఆరోపిస్తున్నారు. 2020, JUNE 8న ఆమె చనిపోయినప్పుడు తనను కొందరు మెంటల్ కస్టడీలోకి తీసుకొని నోరు మూయించారని వివరించారు. ఆదిత్యకు కేసుతో సంబంధం ఉందని, ఆయన సాక్ష్యాధారాలను మాయం చేశారని ఆరోపించారు. అయితే, ఆ రోజు ఎక్కడున్నారో ఆదిత్య చెప్పక పోవడం గమనార్హం.