గల్ఫ్ దేశం సౌదీ అరేబియా అనగానే ముందుగా మనకు గుర్తొచ్చేది ఎడారి. అక్కడ ఎండలు తీవ్రంగా ఉంటాయి. అయితే, ప్రస్తుతం అక్కడ క్రమంగా వాతావరణ పరిస్థితులు మారిపోతున్నాయి. సౌదీలోని అల్-జౌఫ్ ప్రావిన్స్ పరిధిలో చరిత్రలోనే తొలిసారి భారీగా మంచు పడుతోంది. రోడ్లపై తెల్లటి తివాచీలా పేరుకుపోయిన మంచును చూసి స్థానికులు ఆశ్చర్యాలకు గురవుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు వైరల్గా మారాయి.