సిరిసిల్ల: కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు విక్రయించాలి
రైతులు తాము పండించిన పంట ఉత్పత్తులను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపు నిచ్చారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్ద బోనాల, చిన్న బోనాల, ముష్టిపల్లి, సర్దాపూర్ ల్లోని కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడారు. కష్టపడి పండించిన పంటను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని కోరారు.