రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పత్తిని సిసిఐ కొనుగోలు కేంద్రాల్లోని విక్రయించి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని పత్తి రైతులు ఆర్థికంగా బలపడాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆకాంక్షించారు. వేములవాడ అర్బన్ మండలం నాంపల్లి, సంకేపల్లి, కోనరావుపేట మండలం సుద్దాలలో ఏర్పాటుచేసిన సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాలను ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఆది, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సోమవారం హాజరై ప్రారంభించారు.