హరిహర క్షేత్రమైనటువంటి వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో శనివారం కార్తీక మాసం ప్రారంభం కావడంతో ఆలయం భక్తులతో రద్దీగా మారింది. భక్తులు కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకుని, ఆలయం ముందు భాగంలోని రావి, వేపచెట్టు వద్ద కార్తీక దీపాలు వెలిగించి, సేవలో తరించారు. అందర్నీ చల్లంగా చూడు స్వామి అంటూ భక్తులు వేడుకున్నారు. ప్రతియేటా కార్తీక దీపాలు వెలిగించి స్వామి వారిని దర్శించుకుంటామని చెబుతున్నారు.