బుధవారం ఉదయం 10: 50 నిమిషాలకు వార్షిక తనిఖీల్లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఎఎస్పీ శేషాద్రిని రెడ్డితో కలిసి వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ తనిఖీ చేశారు. స్టేషన్ లో పలు కేసుల్లో అధీనంలో ఉన్న వాహనాలను తనిఖీ చేసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారి వెంట టౌన్ సీఐ వీర ప్రసాద్, ట్రాఫిక్ ఎస్సై రాజు, పోలీసు సిబ్బంది ఉన్నారు.