వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారిని సీఎం రేవంత్ రెడ్డి బుధవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా కోడె మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దర్శనానంతరం అద్దాల మండపంలో ఆలయ ప్రధానార్చకులు బీమా శంకర శర్మ ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందించగా, స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, దేవాదాయ శాఖ అధికారులు కలిసి జ్ఞాపికను అందజేశారు. వారి వెంట మంత్రులు, అధికారులు, ఎమ్మెల్యేలు ఉన్నారు.