పెద్దపల్లి: పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని విఠల్ నగర్ కు చెందిన సింగరేణి కార్మికుడు నర్సయ్య పాయిజన్ ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. నర్సయ్య గతంలో కరీంనగర్లో భూమిని కొనుగోలు చేసి అప్పు చేశాడు. భూమి వివాదంలో ఉండటంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుమారుడు రాకేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసినట్లు పేర్కొన్నారు.