కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో బస్టాండ్ వద్ద పెద్దపల్లి సీపీఎం పార్టీ నాయకులతో కలిసి ఆదివారం మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజా పాలన అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్, రాములు, ఆశయ్య పాల్గొన్నారు.