జిల్లాలో పెండింగ్ లే ఔట్ క్రమబద్ధీకరణ దరఖాస్తులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారంపై అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి సమీక్షించారు. జిల్లాలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల ఎల్1 లాగిన్ ప్రక్రియ చివరి దశకు చేరిందని, పెండింగ్ దరఖాస్తులను వారం రోజుల్లో పరిష్కరించాలని ఆదేశించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేష్ పాల్గొన్నారు.