వికారాబాద్ జిల్లా కలెక్టర్, ప్రభుత్వ ఉద్యోగులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్, టీఎన్జీవోస్ పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు బొంకూరి శంకర్ డిమాండ్ చేశారు. కలెక్టరేట్ లో గురువారం భోజన విరామ సమయంలో ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పనిచేస్తున్న ఉద్యోగులపై దాడి చేయడాన్ని ఖండించారు.