శంకరపట్నం మండలం గద్దపాక గ్రామ అంబేద్కర్ నగర్ కాలనీవాసులు మండల కేంద్రంలో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో కొత్త గ్రామ పంచాయతీల ప్రతిపాదన ఉండగా గద్దపాక గ్రామంలోని అంబేద్కర్ నగర్ కాలనీ కొత్త గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ కాలనీవాసులు ఆందోళన చేపట్టారు. తమకు ప్రత్యేక గ్రామపంచాయతీ అవసరం లేదని గద్దపాక ఉమ్మడి గ్రామపంచాయతీగానే మా కాలనీని ఉంచాలని ప్రభుత్వాన్ని కోరారు.