రాజన్న సిరిసిల్ల జిల్లా అనంతగిరిలో గ్రామ పంచాయతీ సిబ్బందికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సిద్ధిపేట మాజీ కౌన్సిలర్ కుంచం సత్యనారాయణ దసరా పండగ సందర్భంగా బట్టల పంపిణీ చేశారు. గ్రామాన్ని అన్నివేళలా పరిశుభ్రంగా ఉంచేందుకు వారి సేవలు వెలకట్ట లేనివని వారికి ఈ పండగ సందర్భంగా కొత్త బట్టలు ఇవ్వాలనే ఉద్దేశంతో వారందరికీ బట్టలు అందించామని తెలిపారు.