జిల్లాలో ఈనెల 17, 18 తేదీల్లో నిర్వహించనున్న గ్రూప్-3 పరీక్షలు సజావుగా జరిగేలా పకడ్బందీ చర్యలు తీసుకున్నట్లు శనివారం కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్, రూట్ అధికారులు, ప్రాంతీయ కో-ఆర్డినేటర్లకు పలు మార్గదర్శకాలు జారీ చేశారు. జిల్లాలో మొత్తం 26, 415 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారని, వీరి కోసం 56 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేసినట్లు కలెక్టర్ తెలిపారు.