జగిత్యాల జిల్లా కేంద్రంలోని గుట్ట రాజేశ్వర స్వామి దేవాలయం ఆవరణలో ఆదివారం కనక దుర్గ సేవా సమితి ఆధ్వర్యంలో కార్తీక మాస వనభోజనం ఏర్పాటు చేశారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో అష్టలక్ష్మి దేవాలయం అవరణలో ఏర్పాటు చేసిన అమ్మవారికి సమర్పించిన ఒడి బియ్యాన్ని వన భోజనంగా నిర్వహిస్తారు. మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్, కనక దుర్గ సేవా సమితి ట్రస్ట్ సభ్యులు గుగిల్ల నాగ భూషణం, రాము పాల్గొన్నారు.