రైతుల కొనుగోలు ప్రక్రియని ట్యాబ్ డేటా ఎంట్రీ పూర్తి స్థాయిలో నమోదు చేయాలని అధికారులను కలెక్టర్ బి సత్య ప్రసాద్ ఆదేశించారు. బుధవారం సారంగాపూర్ మండల కేంద్రంతో పాటు కోనాపూర్, లక్మిదేవిపల్లి, రేచపల్లి, గణేష్ పల్లి గ్రామంలో ఫ్యాక్స్, ఐకెపి సెంటర్ల వరి ధాన్యం కొనుగోలు కేంద్రమును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల ఆర్డిఓ మధు సూదన్, డీఎస్ఓ జితేందర్ రెడ్డి పాల్గొన్నారు.