చొప్పదండి: హౌస్ లిస్టింగ్ సర్వే పకడ్బందీగా చేపట్టాలి.. కలెక్టర్
హౌస్ లిస్టింగ్ సర్వే పకడ్బందీగా చేపట్టాలని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల సర్వే, సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే రాజన్న జిల్లా వ్యాప్తంగా శుక్రవారం మొదలుకాగా, బోయినపల్లి మండల కేంద్రంలోని 11వ వార్డులో చేపట్టిన సర్వేను శుక్రవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సర్వేపై అధికారులను ఆరా తీశారు. ఎంపీడీవో జయశీల, ఎంపిఓ శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.