చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను ఫోన్, వాట్సాప్ లో బెదిరించిన వ్యక్తిపై బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ ద్వారా లుక్ అవుట్ సర్కులర్ జారీ చేసినట్లు కరీంనగర్ రూరల్ ఏసీపీ వెంకటరమణ బుదవారం తెలిపారు. ఆయన వివరాల ప్రకారం ఎమ్మెల్యే సత్యంకు సెప్టెంబర్ 28న మధ్యాహ్నం రాత్రి సమయాల్లో వాట్సాప్ ద్వారా నిందితుడు ఫోన్ చేశాడు. ఈ క్రమంలో తనకు రూ. 20 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశాడు. కాగా, కేసు నమోదైంది.