కేంద్ర ప్రభుత్వం 2016 ఏప్రిల్ 5న 'స్టాండప్
ఇండియా' పథకాన్ని ప్రవేశపెట్టింది. యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్ది తద్వారా
ఉద్యోగాలు కల్పించడమే ఈ పథకం లక్ష్యం. దీని ద్వారా రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకు లోన్ పొందవచ్చు. ప్రతి బ్యాంకులోనూ ఒక్కరికైనా ఈ లోన్ ఇవ్వాలని కేంద్రం సూచించింది.18 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు, మహిళలు దీనికి అర్హులు. ఈ వెబ్‌సైట్ https://www.standupmitra.in/ ద్వారా లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు.