ఆదిలాబాద్: అనారోగ్యంతో ఆదివాసి ఉద్యమనేత మృతి
ఆదివాసీ ఉద్యమకారుడు, ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉయిక సంజీవ్ అనారోగ్యంతో మృతి చెందారు. ఆదిలాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం 4 గంటలకు మృతి చెందినట్లు ఆయన కుటుంబీకులు తెలిపారు. 30 సంవత్సరాల నుంచి ఆదివాసుల హక్కుల కోసం, వారి సమస్యల పరిష్కారానికి ఎన్నో ఉద్యమాలు చేశారని పలువురు నాయకులు పేర్కొన్నారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు.