విద్యార్థుల సంపూర్ణమైన ఆరోగ్యమే లక్ష్యంగా జిల్లాలోని అన్నీ విద్యా సంస్థల్లో ఆరోగ్య పాఠశాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. తాంసి జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో ఆరోగ్య పాఠశాల కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. విద్యార్థులు వ్యాధుల బారిన పడకుండా, ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవాటు చేసేందుకు, ఆత్మ విశ్వాసం, సామాజిక నైపుణ్యాలు పెంపొందించేందుకు ఈ కార్యక్రమం రూపొందించినట్లు చెప్పారు.