బోథ్ మండలం కౌట (బి) గ్రామంలో సమగ్ర కుటుంబ సర్వేను జిల్లా కలెక్టర్ రాజర్షిషా ఆదివారం పరిశీలించారు. ఈ మేరకు గ్రామంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా సర్వే పత్రాలలో నమోదు చేస్తున్న ప్రక్రియను కలెక్టర్ పర్యవేక్షించారు. సమగ్ర కుటుంబ సర్వే జిల్లాలో పకడ్బందీగా కొనసాగుతున్నదని కలెక్టర్ తెలిపారు. సర్వేకు ప్రజలు సహకరించాలని కోరారు. ఆయన వెంట మండల స్పెషల్ ఆఫీసర్ వాజిద్ అలీ, తాసిల్దార్ సుభాష్ ఉన్నారు.