సంగారెడ్డి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించాల్సిన డీఎస్సీ కౌన్సిలింగ్ వాయిదా పడింది. ప్రాంతాల నుంచి వచ్చిన అభ్యర్థులు మంగళవారం నిరాశతో వెను తిరిగి వెళ్లిపోయారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కౌన్సిలింగ్ వాయిదా వేసినట్లు డిఈఓ వెంకటేశ్వర్లు తెలిపారు. కౌన్సిలింగ్ నిర్వహించే తేదీని త్వరలో ప్రకటిస్తామని చెప్పారు.