సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిని మంగళవారం కలెక్టర్ మనుచౌదరి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా రోగులకు అందించే సేవలు, ఓపీ గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. డయాలసిస్ సెంటర్లో రోగులకు అత్యంత జాగ్రత్తగా వైద్యసేవలు అందజేయాలని, చిన్న పొరపాటు జరిగిన ప్రాణాలకే ఆపాయమన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.