ప్రపంచ డయాబెటిక్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈనెల 30వ తేదీ వరకు ఉచిత డయాబెటిక్ స్పిన్నింగ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు సురక్ష హాస్పిటల్ డాక్టర్ పిట్ల రాజు, డాక్టర్ అనిత నాయక్ గురువారం తెలిపారు. హుస్నాబాద్ పట్టణ 65 మంది రన్నర్స్, స్విమ్మర్లకు ఉచిత డయాబెటిక్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు వ్యాయామాన్ని దినచర్యలో భాగస్వామ్యం చేసుకోవాలన్నారు.