చట్టాలపై ప్రతీ ఒక్కరు అవగాహన పెంపొందించుకోవాలి
సోషల్ మీడియాకు, సెల్ఫోన్ కు విద్యార్థులు దూరంగా ఉంటే చక్కని భవిష్యత్ వైపు సాగొచ్చని ఏసీపీ పురుషోత్తంరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గౌరారం దక్కన్ స్కూల్లో రూరల్ సీఐ మహేందర్రెడ్డి, గజ్వేల్ షీటీమ్ బృందం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ మహిళల రక్షణ చట్టాలు, సైబర్ నేరాలు, గుడ్, బ్యాడ్ టచ్ సోషల్ మీడియా వల్ల అనర్ధాలపై అవగాహన కల్పించారు. చట్టాలపై ప్రతీ ఒక్కరు అవగాహన పెంపొందించుకోవాలన్నారు.